గాయాలైనప్పుడు
December 13, 2010
మోకాలు నొప్పి.. ఎందుకు వస్తుందంటారు?!
December 14, 2010

వేధించే మెడనొప్పి

 మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం జీవనశైలి విధానమే. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నమయవుతుంది.

మెడ వెనుక భాగంలో తల నుండి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్‌ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్‌ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి ఆస్టియోఫైట్స్‌ ఏర్పడతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పు వల్ల తీవ్ర మెడనొప్పి వస్తుంది. ఈ సమస్యనే సర్వికల్‌ స్పాండిలోసిస్‌ అంటారు.

కారణాలు

ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడడం వల్ల వస్తుంది. స్పాంజి లేదా దూది ఎక్కువ ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం. కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం. ఒకే చోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం. నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్‌ లోపించడం.

లక్షణాలు

మెడనొప్పి తీవ్రంగా ఉండి మెడ ఎటువైపు కదల్చిన నొప్పి తీవ్రమవుతుంది. నాడులు ఒత్తిడికి గురికావడం వల్ల నొప్పి భుజాల మీదుగా చేతులకు వ్యాపిస్తుంది.తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, తలతిప్పినట్లు అనిపిస్తుంది. చెయ్యి పైకి ఎత్తడం కష్టమవుతుంది. నడుస్తున్నప్పుడు, నిలబడ్డప్పుడు తూలుతున్నట్లుగా అనిపిస్తుంది.

జాగ్రత్తలు 

 సర్వైకల్‌ స్పాండిలోసిస్‌తో బాధపడేవారు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కనీసం 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీవ్ర తగ్గుతుంది. వాహనం నడిపేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు నడుం నిటారుగా ఉండే విధంగా సరైన స్థితిలో కూర్చోవాలి.

బరువులు ఎక్కువగా లేపకూడదు. నొప్పి తీవ్రత ఎక్కువున్నప్పుడు బెడ్‌రెస్ట్‌ తీసుకోవడం తప్పనిసరి. బల్లమీదగానీ, నేలమీదగాని పడుకోవాలి. తలకింద ఎత్తైన దిండ్లు వాడకూడదు. మెడను ఒకేసారి అకస్మాత్తుగా తిప్పకూడదు. మెడనొప్పి ఉన్నప్పుడు స్వల్ప వ్యాయామాలు డాక్టర్‌ సలహా మేరకే చేయాలి. మెడనొప్పి రాకుండా ఉండడానికి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

చికిత్స

 వ్యాధి లక్షణాలు, వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణలోకి తీసుకుని హోమియో వైద్యంలో మందులను ఎంచుకుంటారు. మందుల వివరాలు..

బ్రయోనియా

మెడ కదిలించడం వల్ల నొప్పి అధికమవుతుంది. విశ్రాంతి వల్ల నొప్పి తగ్గుతుంది. వీరు మలబద్దకంతో బాధపడుతుంటారు. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా తాగుతారు. మానసికంగా వీరికి కోపం ఎక్కవ. కదిలించకూడదు. కదలికల వల్ల వీరికి బాధలు అధికమవడం గమనించాల్సిన లక్షణం. మెడ, భుజ కండరాలలో నొప్పి తీవ్ర స్థాయిలో ఉంటుంది. కదిలికలు కష్టంగా ఉంటాయి. ఈ లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయోజనకారి.

హైపరికం 

  మెడ, భుజకండరాలలో తీవ్ర స్థాయిలో నొప్పి ఉంటుంది. కదలికలు కష్టంగా మారుతాయి.

స్పైజీలియా

నొప్పి మెడ నుండి మొదలై ఎడమ భుజంలో ఎక్కువగా ఉండి వేధించే వారికి ఈ మందు ప్రయోజనకారి.

కాల్మియా 

 నొప్పి మెడ నుండి మొదలై కుడి భుజంలో ఎక్కువగా ఉండి వేధించే వారికి ఈ మందు పనిచేస్తుంది.

కోనియం 

 మెడనొప్పితోపాటు కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. మెడ అంటు ఇటు తిప్పినప్పుడు వస్తువులు గుండ్రంగా తిరుగుతున్నట్లు అనిపిస్తాయి. వృద్ధుల్లో వచ్చే మెడ నొప్పికి ఉపయోగం. ఇవే కాక ఇంకా మందులున్నాయి. అయితే లక్షణాలను బట్టి వైద్యుడు సూచించిన మందులు వాడితే ఫలితం ఉంటుంది.

డాక్టర్‌ పావుశెట్టి శ్రీధర్‌,

 

హోమియోఫిజీషియన్‌

అంజనా హోమియోక్లినిక్‌, హన్మకొండ,వరంగల్‌

సెల్‌ : 9440229646

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.