పరిమాణక్రమంలో వెన్ను నిర్మాణం
November 1, 2010
బలాన్ని ఇచ్చే బాదం
November 8, 2010

శబ్దం బాబోయ్ శబ్దం

శబ్దం కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది.

* అసలు శబ్దం లేకుండా ఎలా బతకడం అని మనలో కొందరైనా అనుకుంటారు.

* పండుగలు, పెళ్లీలు, ఎన్నికల సంబరాలు, ఆఖరుకు దహన సంస్కారాలు కూడా శబ్దంతో జరుపుకోవడం మనకు అలవాటైంది.

* 20వ శతాబ్దాన్ని ‘శబ్ద శతాబ్దం’ అన్నారు శాస్త్రవేత్తలు.

* శబ్దం చేయడం తమ జన్మహక్కు అని కొందరు అనుకుంటారు. అయితే వారి చుట్టూ ఉండే వారికి శబ్దం ఆరోగ్య సమస్య కావొచ్చు. ఆరోగ్యంగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు.

* అధిక శబ్దం వల్ల తలనొప్పి, అలసట, నిద్రలేమి, చికాకు రావొచ్చు. ఏకాగ్రత దెబ్బతినొచ్చు.

* శబ్దం విద్యార్ధుల చదువుకు ఆటంకం కలిగించొచ్చు.

* అధిక శబ్దం వల్ల కొందరు రోగులకు ‘ఫిట్స్‌’ రావొచ్చు.

* శబ్దం వల్ల గుండె జబ్బుల వారు గుండె ఆగి గుటుక్కు మనవచ్చు.

* వాహనాలు వాడే వారు ‘సైలెన్సర్లు’ విధిగా వాడాలి. అనవసరంగా హారన్లు మోగించరాదు.

* మీ రేడియోలు, టీవీలు, లౌడ్‌ స్పీకర్లు మీకే పరిమితం చేసుకోండి. ఉచిత వినోదం సమాజానికి ఇవ్వకండి.

* చెట్లు పెంచండి. శబ్దాన్ని తగ్గించండి.

* ‘హాయ్ – హాయ్ – శబ్దం లేదు. చెవులు మూసుకోవాల్సిన పనిలేదు.’ అనే చల్లని రోజుకు ఎదురు చూద్దాం !

మీరూ ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !

డాక్టర్‌ ఆరవీటి రామయోగయ్య

ఆర్గనైజేషన్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌

సోషల్‌ డైమెన్షన్స్‌ ఆఫ్‌ హెల్త్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.