సంతానలేమికి చక్కటి పరిష్కారం ఐవిఎఫ్‌

కీళ్ల నొప్పులు.. హోమియో చికిత్స
November 9, 2010
తొలిదశలోనే చికిత్సకు లొంగే మైలోమా క్యాన్సర్‌
November 9, 2010

సంతానలేమికి చక్కటి పరిష్కారం ఐవిఎఫ్‌

ఈ విధానం మన దేశంలోకి ప్రవేశించిన కొత్తలో దీనిని తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఈ విధానం ద్వారా కలిగిన సంతానం ఆ దంపతుల సంతానం కాదన్నది వారి నమ్మకం. ఖచ్చితంగా ప్రశ్నిస్తే ఇప్పటికీ దీనికి సరియైన సమాధానం చెప్పడం కష్టమే. ఈ విధానం ద్వారా పుట్టే పిల్లలకు పూర్తి కారకులు ఆ దంపతులేననీ చెప్పలేం, కాదనీ చెప్పలేం. ఎందుకటే లోపాల్ని స్త్రీలో గుర్తించినప్పుడు అంటే స్త్రీలో అండం విడుదలవడం లేదని కనుక్కున్నప్పుడు డాక్టర్లు మరొకస్త్రీ యొక్క అండాన్ని తీసుకుని, అండం విడుదల నిలిచిపోయిన స్త్రీ యొక్క భర్త వీర్యకణంతో ఫలదీకరణం చెందించి గర్భం వచ్చేలా చేస్తారు. ఒకవేళ మగవారిలో లోపం ఉన్నట్టు ధృడపడితే అండే శుక్రకణాల విడుదల తీరు గర్భం వచ్చేందుకు అనువైన రీతిలో లేకపోతే మరొక పురుషునియొక్క శుక్రకణంతో స్త్రీయొక్క అండాన్ని ఫలదీకరించి గర్భధారణ జరుగునట్లు చేస్తారు. కనుక గర్భధారణకు దంపతుల్లో ఎవరో ఒకరు మాత్రమే కారకులన్నది వాస్తవం. కనుకనే ఆరోజులలో ఈ ప్రక్రియను వ్యతిరేకించారు. చిన్నచూపు చూశారు. అయితే సమాజం ఎంత మారుతున్నప్పటికీ పిల్లలులేని దంపతులకు సమాజంలో చిన్నచూపే ఎదురవుతున్నది. ఇప్పటికీ వారిని ‘గొడ్రాళ్ళు’ గానే-మాటలతో హింసకు గురిచేస్తున్నారు. అయితే మెజారిటీ జంటలు ఈ చిన్నచూపు కారణంగానో లేక పిల్లలపై గల బలమైన మమకారం వల్లనో మొత్తానికి ఈ వైద్యవిధానం ద్వారా సంతానవంతులు కావడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈరకమైన జంటలు వైద్య పరీక్షలు రహస్యంగానే జరిపించుకుంటున్నారు. తమ సంతానానికి సంబంధించిన రహస్యాన్ని వాళ్లు గోప్యంగానే వుంచడానికి ప్రయత్నిస్తున్నారు. సమాజంలో సరియైన ఆదరణ కరువవుతుందేమోననే భావం వలన కావచ్చు.పట్టణాలలో నివసించే ప్రజలేకాకుండా పల్లెల్లో నివసించే నిరక్షరాస్యులు సైతం ఈ ఫెర్టిలిటీ’ సెంటర్లకు వచ్చి నిర్భయంగా సమస్యలను చర్చించుకుని ఈ ఆధునిక వైద్యవిధానం ద్వారా సంతానం పొందడానికి ప్రయత్నిస్తున్నారంటే ఇది సైన్సు సాధించిన ఒక మహత్తర విజయంగా పేర్కొనవచ్చు. టెస్ట్‌ట్యూబ్‌ ప్రక్రియద్వారా సంతానవంతులైన ఎక్కువమంది దంపతులున్న రాష్ట్రంగా రాజస్థాన్‌ను చెప్పుకోవచ్చు. రాజస్తాన్‌ లోని పల్లెల్లో నివసించే నిరక్షర్యాస్యులే ఈ వైద్య విధానానికి ఎక్కువ సంఖ్యలో మొగ్గుచూపడం విశేషం. అయితే పల్లెల్లో వీళ్ళు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ప్రకృతికి వ్యతిరేకమైన చర్యగా గగ్గోలు పెడుతున్న ఊరి పెద్దలను కాదని తమ వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూ ఫెర్టిలిటీ సెంటరుకు వస్తున్నారని ఫెర్టిలిటీ సెంటర్ల డాక్టర్లు చెప్పడాన్ని బట్టి సమాజంలో-ఆలోచనా విధానంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని భావించవచ్చు. ఇది ఆహ్వానించదగిన పరిణామమే.

మంగ

 

1 Comment

  1. santhanam lenivaariki merichin samachaaram chala bagundhi santhaanaaniki aayurvedamlo gyarnti chikichalu enno unnai mavadda kavaalante anubhavaalathi saha pampistanu

    thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.