అలర్జీ వ్యాధులకు చెక్‌ ఇలా…
November 16, 2010
మహిళల్లో పిసిఒడి సమస్య
November 22, 2010

సర్వైకల్‌ స్పాండిలోసిస్‌

మెడ వద్ద ఉన్న ఎముకల్లో ఏర్పడే అరుగు దలను సర్వైకల్‌ స్పాండైలోసిస్‌ అంటాం. కాల్షి యం తగ్గడం, అధి కంగా మెడను ముం దుకు వంచడం, ఎక్కు వగా ద్విచక్రవాహనాలలో ప్రయాణించడం, లావైన దిండు తల కింద వాడడం, దెబ్బలు తగలడం, వృత్తిరిత్యా ఎక్కువగా మెడ వంచి పనిచేయడం (సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్‌) మొదలగు వారిలో ఈ జబ్బు ఎక్కువగా వస్తుంది.

అరుగుదలలో మెలోని సహజమైన వంపు తగ్గి, డిస్క్‌లు తిరిగి తద్వారా మెడ నుండి భుజంలోకి, చేతి పొడవునా నొప్పి, మొద్దు బారడం, స్పర్శ మారడం, ఒక్కోసారి బలం తగ్గిపోవడం జరుగుతుంది.

దీని వల్ల ఒక్కోసారి భుజవలయంలోని కండరాల్లోకి అధిక నొప్పి కలుగుతుంది. చాలా మంది రోగులు దీన్ని భుజానికి సంబంధించిన జబ్బుగా భావిస్తారు. ఆయింట్‌మెంట్స్‌, జెల్స్‌పూస్తారు. దీని వల్ల భుజంలోని కండరాలు ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి. కనీసం చొక్కా, బనియను వేసుకోవడానికి, నిద్రలో పక్కకు తిరిగి పడుకోవడానికి, స్నాన సమయంలో వీపు రుద్దుకోవడానికి కూడా భుజం వీలుకానంతాగా బిగుస్తుంది. దీన్నే ఫ్రోజెన్‌ షోల్డర్‌ సిండ్రోం అంటాం. మధుమేహ రోగుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది.

వైద్యం

* మధుమేహ రోగులు మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవాలి.

* పడుకునేటప్పుడు తలకింద దిండును శాశ్వత ప్రాతిపదికన తొలగించాలి.

* ఎట్టిపరిస్థితుల్లోనూ మసాజ్‌ చేయడం, ఆయింట్‌మెంట్స్‌, ఆయిల్స్‌, జెల్స్‌ పూయడం వంటివి పూర్తిగా మానాలి.

* కొద్ది శాతం ఉప్పు, ఇసుక కలిపి వేడి చేసి ఒక బట్టలో వేసి భుజం, మెడ వద్ద నిదానంగా కాపడం చేయాలి.

* మెడ, భుజం, రిస్ట్‌, మోచేతికి వివిధ రకాల కదలికలతో కూడిన వ్యాయామం చేయాలి. మొదటి దశలో భుజంపైకి లేవడానికి అవతలి చేయి సపోర్ట్‌ ద్వారా, గోడకు చేతిని ఆనిచ్చి నిదానంగా పైకి పాకించడం ద్వారా, ఇంటికప్పు పైభాగంలోని హుక్స్‌కు చిన్న చక్రాన్ని ఉంచి దానికి ఒక తాడును అమర్చాలి. రెండు చేతుల ద్వారా ఆ తాడును పైకి కిందికిలాగడం ద్వారా పట్టుకుపోయి భుజం నిదానంగా పైకి లేస్తుంది. ఇది చాలా కష్ట తరంగానూ, బాధ కరంగానూ ఉన్నప్పటికీ కనీసం 5,6 నెలలు కష్టపడి చేయాలి. దీని వల్లనే ఫలితాలు ంటాయి.

మందులు

మెడ నొప్పికి సాధారణ నొప్పి తగ్గించే మందులతోపాటు మజల్‌ రిలాక్సెంట్స్‌ మందులు వాడాలి. వీటితోపాటు కాల్షియం, విటమిన్‌-డి, *కాంప్లెక్స్‌, మిథైల్‌ కోబలమన్‌, ఓమెగా-3 ఫాటీ ఆసిడ్స్‌, విటమిన్‌-ఇ వాడాలి. ఆయూర్వేద మందులు కూడా ఉపయోగపడతాయి.

కాలర్‌, ట్రాక్షన్‌ చికిత్స

మెడ నొప్పికి వీలైనంతవరకు హార్డ్‌టు పీస్‌ అడ్జస్టిబుల్‌ సెర్వైకల్‌ కాలర్‌ మాత్రమే వాడాలి. మెడ ఎత్తును కొద్దిగా ఎక్స్టెంషన్‌లో ఉండేట్టు కాలర్‌ను అడ్జస్ట్‌ చేసుకోవాలి. ఈ కాలర్‌ రాత్రి నిద్రలోతప్ప మిగతా సమయంలో ముఖ్యంగా ప్రయాణించేటప్పుడు వాడాలి. రోగ లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాక్షన్‌ వాడాలి. ఇది పడుకున్నప్పుడు, కూర్చోని కూడా వీలుగా ఉండేట్లుగా హెడ్‌హాల్టర్‌ ట్రాక్షన్‌ కిట్‌ రూపంలో లభిస్తుంది.

డాక్టర్‌ జె. భాను కిరణ్‌

ఆర్థొపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వెంకట రామప్ప హాస్పిటల్‌

సత్యసాయి మహిళాకళాశాల ఎదురుగ

బెంగళూరురోడ్డు, అనంతపురం.

ఫోన్‌ : 08854272881

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.