సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో వచ్చినవే మొబైల్ ఫోన్స్. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు సెల్‌ఫోన్లను వాడుతున్నారు. ఇక యువతీ యువకుల్లోనైతే చైన్ స్మోకర్స్ మాదిరిగా కొందరు చైన్ సెల్ టాకర్స్‌గా మారుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్స్ వాడకంతో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతూ టాక్సికాలజిస్ట్ దేవ్‌రా డేవిస్ బాంబు పేల్చడం అందర్నీ ఆలోచింపచేస్తోంది. ఈ శాస్తవ్రేత్త 2007 సంవత్సరానికి నోబెల్ పీస్ ప్రైజ్ లభించిన బృందంలోని సభ్యురాలు కావడం సెల్ ప్రియులను ఈ విషయంపై దృష్టి సారించేటట్టు చేసింది
అమెరికన్ సైంటిస్ట్ దేవ్‌రా డేవిస్ ఆ దేశంలోని ప్రముఖ ఎపిడెమియాల జిస్ట్‌లలో ఒకరిగా పేరు గాంచారు. ఆమె మొబైల్ ఫోన్ల వాడకంపై గత కొంతకాలంగా ప్రత్యేకంగా పరిశోధనలు చేశారు. యూత్‌లో సెల్ ఫోన్ల వాడ కం పెరగడంపై ఆమె హెచ్చరికలు చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల వాడకంతో రాబోయే మూడు సంవత్సరాల్లో యువతలో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర య్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
వీటి ఉపయోగంతో మగ వారిలో వ్యంధత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆమె యుఎస్, చైనా, ఆస్ట్రేలియా తదితర ఏడు దేశాల్లో పరిశోధనలు నిర్వహించారు. యువ కులు స్విచాన్ చేసిన మొబైల్ ఫోన్స్‌ను ప్యాంట్ జేబుల్లో పెట్టుకొనే వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. కొత్తగా తండ్రులు కావాలనుకునే యువకులు ప్రతిరోజు కనీసం నాలుగు గంటల పాటు సెల్ ఫోన్ వాడితే అంతే సంగతులు. ఈవిధంగా మొబైల్‌ను వాడితే ఇతరులతో పోల్చుకుంటే వారిలో స్పెర్మ్ కౌంట్ సగానికి సగం తగ్గుతుందని పరిశోధనల్లో దేవ్‌రా డేవిస్ చెప్పడం గమనార్హం.
మొబైల్ రేడియేషన్ మధ్య స్పెర్మ్‌లను ఉంచితే అవి బలహీనపడడమే కాకుండా సన్నబడి వేగంగా ఈదలేకపోతున్న విషయం తమ పరిశోధనలో తేలిందని ఆమె పేర్కొన్నారు. తక్కువ శక్తితో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిట్టర్‌లైన మొబైల్ ఫోన్లు మైక్రోవేవ్ రేడియే షన్‌ను సృష్టిస్తాయి. సెల్ ఫోన్ రేడియేషన్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనీ ఈ విషయంలో సెల్‌ఫోన్ కంపెనీలు ఏం చేస్తా యో చూడాల్సిందేనని ఆమె పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడ డం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయనీ ఇవి ఆరోగ్యవంతమైన పిల్లలు కలిగే అవకాశాలను నీరుకారుస్తాయని ఆమె హెచ్చరిస్తున్నారు. ఇవి మనకు దీర్ఘకాల సమస్యలను సృష్టిస్తూ మనుషుల మెదడు, శరీరాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని దేవ్‌రా డేవిస్ పేర్కొన్నారు.
యుఎస్, స్వీడన్, గ్రీస్, ఫ్రాన్స్, రష్యాలలో జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలన్నీ తేటతెల్లమయ్యాయని చెప్పారు. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్తవ్రేత్తలు ఇటీవల మొబైల్ ఫోన్ల వాడకంపై పరిశోధనలు నిర్వహించారు. వారు రెండు గంటల మొబైల్ ఫోన్ లెవెల్ రేడియేషన్‌ను ఎలుకల మెదడులోని డిఎన్‌ఎలో ప్రవేశపెట్టారు. కొంతకాలానికి వాటిలో ట్యూమర్లు ఏర్పడిన విషయం బయటపడి అందరూ నిర్ఘాంతపోయారు. కనుక సెల్ ఫోన్లతో జాగ్రత్త పడక తప్పదు.