వైద్యం | Vaidyam
  • Home
  • గృహ వైద్యం
  • ప్రకృతి వైద్యం
  • మానసిక సమస్యలు
  • క్యాన్సర్
    • కాలేయ క్యాన్సర్‌
    • గర్భాశయ క్యాన్సర్‌
  • గ్యాస్ సమస్యలు
  • నొప్పులు
    • కడుపు నొప్పి
    • కీళ్ల వ్యాధులు
    • గొంతు నొప్పి
    • తలనొప్పి
    • నడుమునొప్పి
  • మా గురించి
ఎయిడ్స్ ఇలా కూడా రావచ్చు….!
August 13, 2010
దంత వైద్యానికి లేజర్‌ – చికిత్స
October 4, 2010

మొలలు – చికిత్స, నివారణ

Categories
  • మలబద్ధకం
  • మొలలు
Tags
  • పైల్స్
  • మలబద్ధకం
  • మొలలు

కొందరు పైల్స్ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పైల్స్‌తో పాటు ఫిషర్‌, ిఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి. అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.

పైల్స్: సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్ ఒకటి. పైల్స్ ఎక్కువగా మధ్య వయ స్సులో ఉన్నవారికి వస్తుంది. పీచు పదా ర్థాలు తక్కువగా తీసుకున్నవారికి, మంచి నీళ్లు తక్కువగా తాగేవారిలో ఈ వ్యాధి కని పిస్తుంది. సై్పసీ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుం ది. పైల్స్ వల్ల విరోచనాలకు ముందు లేదా తర్వాత రక్తం రావడం జరుగుతుంది. కొన్ని సార్లు రక్తం గడ్డలు,గడ్డలుగా కూడా వస్తుంది.

మరికొన్నిసార్లు లోపలి మాంసం బయటకు కూడా రావచ్చు. పైల్స్‌ వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. పైల్స్‌ను మూడు గ్రేడులుగా విభజించవచ్చు. మొదటి గ్రేడులో పైల్స్‌ లోపల మాత్రమే కనిపిస్తుంది. రెండవ గ్రేడులో లోపలి నుంచి బయటకు వచ్చి మ ళ్లీ వాటంతట అవే లోపలికి వెళ్లిపోతాయి. మూడవ గ్రేడులో బయటకు వచ్చి బయటే ఉంటాయి. నాలుగవ గ్రేడులో బయటకు వచ్చిన వాటికి ఇన్‌ఫెక్షన్‌ రావచ్చు. కొన్ని సార్లు పైల్స్‌ ఆపరేషన్‌ తర్వాత కూడా మళ్లీ వచ్చే అవకాశం ఉంది. వీటిని సెకండరీ హెమరాయిడ్స్‌ అని అంటారు.

ఫిషర్‌: ఈ వ్యాధి ఏ వయస్సు వారికైనా రావచ్చు. ఇది రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలద్వారం పగిలి ఫిషర్‌ వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి విపరీతమైన నొప్పి వస్తుంది. కొన్నిసార్లు రక్తం కూడా రావచ్చు. రక్తం ఒకటి, రెండు చుక్కలు మా త్రమే వస్తుంది. విరోచనాలు అయిన తర్వా త నొప్పి ప్రారంభమై మూడు, నాలుగు గం టల వరకు ఉంటుంది. కొన్నిసార్లు ఫిషర్‌ మలద్వారానికి ముందు వైపు, వెనుకవైపున కూడా ఉంటుంది. మరికొన్నిసార్లు ఫిషర్‌తో పాటు చర్మం కూడా ముందుకు చొచ్చుకు వస్తుంది. దీన్ని సింటినైన్‌పైల్‌ అంటారు.

ఫిస్టులా: ఈ వ్యాధిని కొందరు లూటి అని కూడా అంటారు. ఇది ఈ రకం వ్యాధు లన్నింటికెల్లా ఇబ్బందికరమైన సమస్యగా చెప్పుకోవచ్చు. పెద్ద పేగు నుంచి బయటకు వచ్చే చర్మానికి ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఈ వ్యాధి వ స్తుంది. పిస్టులా వ్యాధి రెండు రకాలు. మల ద్వారానికి పోయే పై దారిలో ఏర్పడేది ఒక రకం, కింది భాగంలో ఏర్పడేది మరో రకం. పైభాగంలో వచ్చేది సామాన్యంగా సమాంతరంగా ఉంటుంది. కింది భాగంలో వచ్చే దారి వంకరగా ఉంటుంది. ఈ వ్యాధి ఏ వయస్సులో ఉన్నవారికైనా రావచ్చు. ము ఖ్యంగా ఎక్కువ సేపు కూర్చొని ఉన్నవారిలో ఈ వ్యాధి వస్తుంది.

బయటకు చిన్న రంధ్రా లుగా కనపడవచ్చు. కొన్నిసార్లు అవి మూ సుకుపోయినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ వచ్చి చీము పట్టే అవకాశాలు ఉంటాయి. నొప్పి కూడా ఉండవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ వల్ల నొప్పి వస్తుంది. పిస్టులాను లోలెవెల్‌, హైలెవెల్‌ రకాలుగా వర్గీకరిస్తారు. లోలెవెల్‌ రకం దోవ పొడవు గా ఉంటుంది. ఇది రెండు సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. హైలెవెల్‌లో దోవ పొడవు కొన్నిసార్లు నాలుగు, అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు విరోచనాలు కంట్రోల్‌ కాకపో వచ్చు. చీము, రక్తం కూడా రావచ్చు.

పరీక్షలు: పైల్స్ వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. వీరికి ప్రాక్టోస్కోపిక్‌ పరీక్షను నొప్పి లేనప్పు డు చేస్తారు. ఈ పరీక్షలో పైల్స్‌ బాగా కనిపిస్తాయి. కొలోస్కోపిలో పైల్స్‌, ఫిషరీ, ఫిస్టులా వ్యాధులను తెలుసుకోవచ్చు. పొట్ట స్కానింగ్‌లో వేరే పేగులకు ఏమైనా గడ్డలు ఉన్నాయా తెలుస్తుంది. పిస్టులోగ్రామ్‌ పరీ క్షను పిస్టులా ఉన్నవారికి నిర్వహిస్తారు. దారి పొడవు ఎంతోఉందో తెలుసుకోవడం జరుగుతుంది. బేరియన్‌ ఎనిమా పరీక్ష ద్వా రా పెద్ద పేగు ఎలా ఉండో తెలుసుకోవచ్చు.

వైద్యం: పైల్స్ వ్యాధి వచ్చిన వారిలో మొదటి, రెండు గ్రేడులుగా ఉన్నవారికి చాలా వరకు మందులతో నయమవుతుంది. కొన్నిసార్లు స్ల్కీరో థెరపీ ద్వారం పరీక్ష చేస్తూ డాక్టర్‌ పైల్స్‌లోకి ఇంజెక్షన్‌ చేస్తారు. ఆ ఇంజెక్షన్‌ ఇవ్వడం వల్ల వాటిలో రక్త ప్రసరణ తగ్గి కృశించుకుపోతాయి. పైల్స్‌ బాగా ముదిరిన వారికి ఎమరోయెక్టమీ ఆపరేషన్‌ ద్వారా వాటిని తొలగిస్తారు. ఫిషర్‌ వచ్చినవారి ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.

విరోచనాలు సాఫీగా సాగేందుకు మందులు వాడాలి. ఈ విధంగా చేసినా ఇబ్బంది మళ్లీ వస్తుంటే విరోచనాలు జరిగే దారి బిగుసుకు పోతుంది. ఆ సమయంలో ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ను స్పింటరాటమి అని అంటారు. పిస్టులా వ్యాధిని హై లెవెల్‌, లో లెవెల్‌ను బట్టి వైద్యం చేస్తారు. కొన్నిసార్లు వీటిని తీసివేయాల్సి ఉంటుంది. ఈ ఆపరేషన్‌ చేసేటప్పుడు విరో చనాలను ఆపుకునేందుకు ఎలాంటి ఇబ్బం ది కలగకుండా చూసుకోవాలి. ఈ ఆపరేష న్‌ను ఫిస్టురెక్టమీ అని అంటారు.

జాగ్రత్తలు: ఈ వ్యాధులు వచ్చినవారు సమతుల ఆహారం తీసుకోవాలి. ఆహారం లో పీచు పదార్థాలు(పండ్లు, కూరగాయలు) ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉప వాసాలు చేయకూడదు. విరోచనాలు అ య్యేందుకు మందులు ఎక్కువగా వాడ కూ డదు. మన జీవన విధానంలో కొన్ని మార్పు లు చేసుకోవడం ద్వారా ఇటువంటి వ్యాధులకు చాలావరకూ దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పీచు పదార్ధాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీర క్రియలు ఆరోగ్యంగా ఉంటాయి.

సంబంధిత ఇతర వ్యాసాలు:

  1. ‘బద్ధకం’ వదిలించుకోండి
  2. పైల్స్‌తో బాధపడుతున్నారా?
  3. పీచులో ఉందిలే మజా
  4. మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం
  5. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా…
Share
29
ధన్వంతరి
ధన్వంతరి

Related posts

August 9, 2012

మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం


Read more

4 Comments

  1. sridhar says:
    May 6, 2011 at 12:20 am

    I am suffering with pisher problem, kindly suggest what type of food I have take.

    Reply
    • Srinivas says:
      June 3, 2015 at 3:10 pm

      I am suffering with pisher problem kindly suggest medicine and food

      Reply
  2. Srivass says:
    October 28, 2011 at 3:24 am

    i am suffering with hair problems. kindly give suggestions

    Reply
  3. chandra says:
    October 26, 2012 at 10:46 am

    very nice manchi infor mation itcharu tan q

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.

జబ్బుల సూచీ

  • అమీబియాసిస్‌
  • అలర్జీ
  • అవాంఛిత రోమాలు
  • ఆయాసం
  • ఆయుర్వేదం
  • ఆస్తమా
  • ఊపిరితిత్తుల వ్యాధులు
  • ఎముకల సమస్యలు
    • వెన్నునొప్పి
  • ఎయిడ్స్
  • కంటి సమస్యలు
  • కాలేయ సమస్యలు
  • కుక్క కాటు
  • కోపం
  • క్యాన్సర్
    • కాలేయ క్యాన్సర్‌
    • గర్భాశయ క్యాన్సర్‌
    • ప్రొస్టేట్ కేన్సర్‌
  • క్లోమం వ్యాధి
  • క్షయ
  • గర్భ నిరోధక పద్దతులు
  • గర్భస్త సమస్యలు
  • గాయాలైనప్పుడు
  • గాయిటర్‌
  • గుండె జబ్బులు
  • గృహ వైద్యం
  • గ్యాస్ సమస్యలు
  • చర్మవ్యాధి
  • జలుబు
  • జుట్టు సమస్యలు
  • జ్వరం
  • డిఎన్‌ఏ
  • థైరాయిడ్ సమస్యలు
  • దగ్గు
  • దంత సమస్యలు
    • చిగుళ్ల వ్యాధులు
    • నోటి దుర్వాసన
  • నాడీ సమస్యలు
  • నిద్రలేమి
  • నొప్పులు
    • కడుపు నొప్పి
    • కీళ్ల వ్యాధులు
    • గొంతు నొప్పి
    • తలనొప్పి
    • నడుమునొప్పి
    • పొత్తి కడుపు నొప్పి
    • మెడనొప్పి
    • మోకాలినొప్పి
  • నోటి సంబంధ వ్యాదులు
  • పక్షవాతం
  • పాముకాటు
  • పిసిఒడి సమస్య
  • పొట్ట ఉబ్బరము
  • పోషకాహార సమస్య
    • తల్లిపాలు
  • ప్రకృతి వైద్యం
  • బహిష్టు సమస్యలు
  • మధుమేహం
  • మలబద్ధకం
    • మొలలు
  • మానసిక సమస్యలు
    • ఒత్తిడి
  • మూత్రపిండాల వ్యాధులు
  • మూర్ఛ వ్యాధి
  • మోకాలు నొప్పి
  • యోగా
  • వర్టిగో
  • వెరికోస్‌ వీన్స్‌
  • వ్యాయామం
  • సంతానలేమి
  • సెక్స్ సమస్యలు
  • స్థూలకాయం
  • హెర్నియా
  • హైపర్‌టెన్షన్‌
  • హోమియో చికిత్స

తాజా చేర్పులు

  • 0
    అరిగింఛే శక్తి అల్లంలో పుష్కలం
    December 5, 2018
  • 0
    అవాంఛిత రోమాలతో అవస్థలు
    December 3, 2018
  • విటమిన్-డి లోపం0
    విటమిన్-డి లోపిస్తే….
    December 3, 2018
  • instant noodles0
    మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి!
    May 31, 2015
  • 0
    తల్లుల అలవాట్లు.. పిల్లల అగచాట్లు
    September 12, 2014

ఇటీవలి వ్యాఖ్యలు

  • June 3, 2015

    Srinivas commented on మొలలు – చికిత్స, నివారణ

  • March 1, 2015

    saikrishna commented on కంటిని కాపాడుకోండి…

  • August 22, 2014

    Vinay commented on ఒంటి బరువు … వదిలించుకోండిలా

  • May 7, 2014

    javed commented on కూల్‌డ్రింక్స్‌తో పళ్ళకు హాని

  • January 7, 2014

    ధన్వంతరి commented on కదలండి-ఆరోగ్యంగా ఉండండి

ట్యాగులు

  • అమీబియాసిస్‌
  • అలర్జీ
  • అవాంఛిత రోమాలు
  • ఆయాసం
  • ఆయుర్వేదం
  • ఆస్తమా
  • ఊపిరితిత్తుల వ్యాధులు
  • ఎముకల సమస్యలు
  • ఎయిడ్స్
  • ఒత్తిడి
  • కంటి సమస్యలు
  • కడుపు నొప్పి
  • కాలేయ క్యాన్సర్‌
  • కాలేయ సమస్యలు
  • కీళ్ల వ్యాధులు
  • కుక్క కాటు
  • కోపం
  • క్యాన్సర్
  • క్లోమం వ్యాధి
  • క్షయ
  • గర్భ నిరోధక పద్దతులు
  • గర్భస్త సమస్యలు
  • గర్భాశయ క్యాన్సర్‌
  • గాయాలైనప్పుడు
  • గాయిటర్‌
  • గుండె జబ్బులు
  • గృహ వైద్యం
  • గొంతు నొప్పి
  • గ్యాస్ సమస్యలు
  • చర్మవ్యాధి
  • చిగుళ్ల వ్యాధులు
  • జలుబు
  • జుట్టు సమస్యలు
  • జ్వరం
  • డిఎన్‌ఏ
  • తలనొప్పి
  • తల్లిపాలు
  • థైరాయిడ్ సమస్యలు
  • దగ్గు
  • దంత సమస్యలు
  • నడుమునొప్పి
  • నాడీ సమస్యలు
  • నిద్రలేమి
  • నొప్పులు
  • నోటి దుర్వాసన
  • నోటి సంబంధ వ్యాదులు
  • పక్షవాతం
  • పాముకాటు
  • పిసిఒడి సమస్య
  • పొట్ట ఉబ్బరము
Copy Right © 2017, Vaidyam.info. All Rights Reserved.