రేబిస్ గురించి కొన్ని విషయాలు…

గర్భాశయంలో గడ్డలు
July 2, 2011
కంటిని కాపాడుకోండి…
July 2, 2011

రేబిస్ గురించి కొన్ని విషయాలు…

ఇప్పుడు మన రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న వ్యాధి రేబిస్. అందుకే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం.

రేబిస్ జంతువుల నుండి మనుషులకు వచ్చే వ్యాధి. ర్యాబ్డో వైరిడే కుటుంబానికి చెందిన విస్సా వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా యేటా రేబిస్ వ్యాధితో దాదాపు 55,000 మంది మనుషులు చనిపోతున్నారు. మన దేశంలో అయితే 20,000 మంది చనిపోతున్నారు.

మన దేశంలో ఈ వ్యాధి ఎక్కువగా కుక్కలు కరవడం, గీరడం వల్ల వస్తుంది.

ఈ వ్యాధి నక్కల నుండి, గబ్బిలాల నుండి కూడా రావచ్చు. అమెరికా, కెనడా దేశాల్లో గబ్బిలాల నుండి ఎక్కువగా వస్తుంది.

కుక్క కరిచిన తర్వాత 1 నుండి 3 నెలల్లో ఈ వ్యాధి రావచ్చు. అరుదుగా వారం లోపల, 1 నుండి 2 సంవత్సరాల్లో కూడా రావచ్చు.

రేబిస్‌కు వైద్యం లేదు. రేబిస్‌ను ముందుగా గుర్తించే వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా లేవు.

కుక్క కరిచిన వెంటనే సబ్బు, నీటితో గాయాన్ని బాగా కడగడం అత్యుత్తమ చర్య. గాయానికి కుట్టు వేయరాదు. కట్టు కట్టరాదు.

రేబిస్‌కు 125 సంవత్సరాల నుండి వ్యాధి నిరోధక టీకా ఉంది. లూయిస్ పాశ్చర్ ఈ టీకా కనిపెట్టాడు. డాక్టర్ సలహాతో టీకాలు వేయించుకోవాలి.

రేబిస్ వచ్చినవారిలో జ్వరం, తలనొప్పి, నిద్రలేమి, గాబరా, అతి ఉత్సాహం, తీవ్ర ఆందోళన మొదట కనిపించే వ్యాధి లక్షణాలు. ఆ తర్వాత దప్పిక, నీటి భయం, అపస్మారక స్థితి, మరణం సంభవిస్తాయి.

రేబిస్ వచ్చినవారు సాధారణంగా మరణిస్తారు.

కుక్కలకు టీకాలు వేయడం ద్వారా మనుషుల్లో రేబిస్ వ్యాధిని తగ్గించవచ్చు. ఈ విధంగా శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు రేబిస్ మరణాలను బాగా తగ్గించాయి.

సెప్టెంబర్ 28 – ప్రపంచ రేబిస్ దినం.

ఈ అంశాలు ఒక నోటు పుస్తకంలో రాసి పెట్టండి. మీ స్నేహితులు, బంధువులు, సహచరులకు కూడా తెలియజేయండి.

– డా॥ఆరవీటి రామయోగయ్య

వ్యవస్థాపకులు, ఓపీఎస్‌డీహెచ్
SOURCE:SAKSHI DAILY
DATED:02/07/2011

ధన్వంతరి
ధన్వంతరి
i am a cool and friendly boy who will be always with people who trust me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Time limit is exhausted. Please reload the CAPTCHA.