తెలుగులో పత్రికల విస్తృతి పెరగడంతో సమాచార విస్తృతి సైతం పెరిగింది. అనేకమైన పత్రికలు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అనునిత్యం వ్యాసాలను ప్రచురిస్తున్నాయి. వీటిలో ఉపయుక్తమైన అంశాలు కోకొల్లలు.

రోజువారీ పత్రికలలో వచ్చే అంశాలు కేవలం కొద్ది కాలం మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. పత్రికలు ప్రచురిస్తున్న ఇటువంటి అమూల్య సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే మా ఈ ప్రయత్నమే www.vaidyam.info

వ్యాధుల, చికిత్సల వారీగా ఆయా పత్రికలు ప్రచురించే సమాచారాన్ని క్రోడీకరించి ప్రజలకు అందుబాటులోకి ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయా పత్రికలూ, ప్రసార మాధ్యమాలలో వచ్చిన అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం. తద్వారా తెలుగులో- అంతర్జాలంలో ఒక వైద్య విజ్ఞాన భాండాగారం తెలుగువారికి సొంతం చెయ్యాలన్నదే మా తపన.

ఒకవేళ సంబధిత ప్రచురణ సంస్థలకు లేదా రచయితలకు ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలున్నట్లయితే తెలియచేసినచో వాటిని తొలగించగలమని సవినయంగా మనవి చేస్తున్నాం.

‘అవగాహన పెరిగినపుడే ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది’ అని నమ్మి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు.

గమనిక:

వీక్షకులు ఇక్కడి సమాచారాన్ని అవగాహన పెంచుకోడానికి మాత్రమే పరిమితం చేసుకోవాలి. చికిత్సలకు సంబంధించి తప్పనిసరిగా నిపుణులైన వైద్యుల సలహాను తీసుకోవాలి.