December 5, 2018

అరిగింఛే శక్తి అల్లంలో పుష్కలం

 అల్లం ఘాటయిన ఆహార ద్రవ్యం. ఘాటయినవన్నీ వేడిచేసే స్వభావాన్ని సహజంగా కలిగి ఉంటాయి. కాబట్టి వేడి శరీర తత్వం ఉన్నవారికి అల్లం విషయంలో జాగ్రత్త అవసరం అవుతుంది.అటు మాంసాహారానికి, ఇటు శాకాహారానికి అల్లం అనుకూలంగా ఉంటుంది. ఆయా ఆహార పదార్థాలు తేలికగా అరిగేందుకు తోడ్పడుతుంది. ఆహార పదార్థాలు వికటించి విష దోషాలు శరీరంలో వ్యాపించకుండా ఇది రక్షణ నిస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం రోగులకూ, వాతరోగులకూ, సొరియాసిస్ రోగులకూ ఇది దివ్యౌషధం. […]
December 3, 2018

అవాంఛిత రోమాలతో అవస్థలు

ఆడవాల్లకు తలపైన ఒత్తయిన మెత్తని కురులు ఎంతో అందం. అవి కొంత మందిలో బిరుసుగాను, వంకీలుగాను, ఉంగరాలతోను కూడా అందమిస్తాయి. అయితే అవి వేరే అసహజమైన ప్రదేశాలలో అంటే ముఖంపైన పైపెదవి మీద, చిబుకం మీద, చేతులు ముంజేతులు, మోకాళ్ల మీద నల్లని వెంట్రుకలు ఉంటే అది గమనించి చికిత్స చేయించవలసిన పరిస్థితి. ఛాతి మీద కూడా కనిపించవచ్చు. గొంతు స్వరం మారవచ్చు. చిన్నపిల్లల్లో ఇలా ఉంటే అది కొన్ని […]
December 3, 2018
విటమిన్-డి లోపం

విటమిన్-డి లోపిస్తే….

అన్ని విటమిన్లు శరీరారోగ్యానికి అవసరమే అయినా ఒక్కొక్క విటమినుకి శరీరంలో ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది. విటమిన్ ‘డి’ మన శరీరంలోని ఎముకలకి, గుండెకు చాలా అవసరం. డి విటమిన్ 30 నుంచి 100 యూనిట్ల వరకు ఉండడం అత్యవసరం. 30 కంటే తక్కువ ఉన్నవారికి రకరకాల బాధలు చిన్నవి, పెద్దవి కంప్లయింట్లు ఉంటాయి. ఇవి చాపకింద నీరులా మెల్లమెల్లగా చేరి, చివరికి నడుములోని ఎముకలు, కాలి తుంటి ఎముకలు, చేతి […]
May 31, 2015
instant noodles

మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి!

అమ్మా ఆకలి…అంటూ పిల్లవాడు పరిగెత్తుకురాగానే, టూ మినిట్స్‌ అమ్మా! అంటూ మ్యాగీ ప్యాకెట్‌ చించి నీళ్లలో వేసి ప్లేట్‌లో వేడి వేడి నూడుల్స్‌ వడ్డించేస్తుంది. టు మినిట్స్‌ ఫుడ్‌ అంటేనే మ్యాగీ అని అర్థమయ్యేంతగా దాన్ని ప్రచారం చేశారు. ముఖ్యంగా పిల్లలు, యువతను ఈ ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ బాగా ఆకట్టుకుంది. అయితే రెండు నిముషాల్లో వండి పెట్టడం బాగానే ఉంది కానీ, దాన్ని పూర్తిగా అరిగించుకోవాలంటే మీ జీవితం చాలదు […]
September 12, 2014

తల్లుల అలవాట్లు.. పిల్లల అగచాట్లు

సాధారణంగా స్ర్తిలు పరిసరాల ప్రభావాలవల్ల కొన్ని అలవాట్లకు లోనవుతారు. అవే అలవాట్లు బిడ్డ పుట్టిన తరువాత కూడా కొనసాగుతాయి. కొంతమంది తల్లులు ఒకే పక్క పడుకుని నిద్రపోతారు. రెండోపక్క పడుకుంటే వారికి నిద్రపట్టదు. బిడ్డ పుట్టిన తరువాత కూడా వారు ఎప్పుడూ ఒకేవైపు పడుకుని బిడ్డకు పాలివ్వడంవల్ల, బిడ్డ శరీరం ఒకేపక్క ఎక్కువ వత్తిడికి గురై బిడ్డ ముఖం, దవడలు ఒక్క పక్క తోసుకుపోయి రెండవ పక్క పుష్టిగా వుంటాయి. […]
July 15, 2014
ఉసిరి

ఉసిరితో ఎన్నో ఉపయోగాలు

ఉసిరికాయ పెచ్చుల పొడి, పిల్లిపీచర గడ్డల పొడి (శతావరి), పంచదార, తేనె ఈ నాలుగింటినీ సమాన భాగాలు కలిపి పాలు లేదా నెయ్యితో తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. దీనిని చతుస్సమ కల్పం అంటారు. ఉసిరి పండ్ల రసాన్ని నీళ్లతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే వాయువు బంధించబడి, పైవైపుకదలటం వల్ల వచ్చిన కడుపు నొప్పి తగ్గుతుంది. ఉసిరి పొడిని […]
June 10, 2014
మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, మూత్ర విసర్జనలో అవరోధం, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వంటి సమస్య మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీయవచ్చు. నీళ్లు తక్కువగా తాగేవారిలో, చెమటలు అధికంగా పోసేవారిలో రక్తంలో లవణాల సాంద్రత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. శారీక శ్రమ, వ్యాయామం లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య సాధారణంగా 30 ఏళ్లపైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్త్రీలలోకంటే పురుషుల్లో మూడు […]
April 26, 2014

నిమ్మరసంతో నిండైన ఆరోగ్యం

వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం జరుగుతుంటుంది. నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మరసంలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ […]
April 26, 2014

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్

సర్వైకల్ కేన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది. గణనీయంగా ముందుగానే నిరోధించగల వ్యాధి ఇది అని నిపుణులు చెబుతున్నారు. నిరోధక టీకాలు కేన్సర్ రాకుండా వాక్సిన్ ద్వారా ముందుగానే నిరోధించే అవకాశం రూపొందిన తొలి కేన్సర్ రకం ఇదే. ఇందుకుగాను ఒకటి కాదు రెండు వ్యాక్సీన్లు ఉన్నాయి. అయినా కూడా భారతదేశంలో ఇది ఏటా 1,32,000 మంది మహిళలకు సోకుతోందని, ఇందులో 72వేల […]
April 24, 2014
పొత్తి కడుపు నొప్పి

పొత్తి కడుపు నొప్పి – నివారణోపాయాలు

వివిధ వృత్తుల్లో పనిచేసే మహిళలు, గృహిణులు, వివిధ యంత్ర పరికరాలపై పనిచేసే స్ర్తిలు, రసాయనాల ఫ్యాక్టరీలలో పనిచేసేవారు, ఆహార పదార్థాలలో అధికంగా కారం మసాలాలు సేవించేవారు, ఎండలో పనిచేసే వివిధ వృత్తులవారు, మూత్ర విసర్జనకి వీలుకాని సందర్భం తోడైనపుడు, ఇతరేతర కారణాలవల్ల ఇన్‌ఫెక్షన్ సోకినపుడు మూత్రంలో మంట, మూత్ర విసర్జనాంతరం పొత్తి  కడుపు నొప్పి, మూత్రదోహం, జ్వరం, మూత్ర విసర్జనపుడు దుర్వాసన, నడుము నొప్పి, వాంతులు మొదలగు లక్షణాలు ఏర్పడతాయి. కిడ్నీలు […]
March 30, 2014

జ్ఞాన దంతం తీస్తే జ్ఞానం పోతుందా?

సాధారణంగా మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజింపవచ్చు. బాల్యం: ఈ దశలో ఉన్న పిల్లలకు అంటే పుట్టినప్పటినుండి 13 సంవత్సరాల లోపు పిల్లలను బాల్య దశగా పరిగణిస్తారు. ఈ దశలో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి. ఈ దశను ‘అగ్లిడక్లంగ్’ దశ అని అంటారు. ఎందుకంటే పాలపళ్లు కొన్ని ఊడిపోతుంటే కొన్ని వస్తుంటాయి. ఇట్లా పళ్లన్ని కూడ అస్తవ్యస్తంగా వికారంగా చూడడానికి అందవికారంగా వుంటాయి. యుక్త వయసు: సాధారణంగా […]
March 29, 2014

కూల్‌డ్రింక్స్‌తో పళ్ళకు హాని

మన శరీరం పూర్తిగా జీవ కణజాలంతో నిర్మితమైంది. ప్రతి ఒక్క జీవకణానికి ప్రాణం ఉంటుంది. ఈ జీవకణాలకు ఎప్పుడు ఫ్లూయిడ్స్ (జీవజలం) సాంద్రత శాతం నిర్దిష్టంగా ఉండాలి. వేసవిలో ఎండ వేడిమికి శరీరంలో జీవజలం శాతం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో శరీరంలోని జీవకణాలు దెబ్బతిని ఆయా అవయవాలు విధి నిర్వహణ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వర్తించలేక శరీరంలో శక్తి తక్కువైపోయి శరీరం కదలలేని పరిస్థితి ఏర్పడి కూలబడిపోతుంది. ఈ పరిస్థితినే ‘డిహైడ్రేషన్’ […]