October 24, 2012

నడుము నొప్పి తీవ్రమైతే విశ్రాంతి తప్పనిసరి

ఉదయం లేవగానే ఈ మధ్యకాలంలో చాలామందికి నడుము పట్టేసినట్లుగా ఉండి కదలికలు కష్టంగా మారుతున్నాయి. కొద్దిసేపు వ్యాయామం చేసిన తర్వాతగాని, వాకింగ్ చేసిన తర్వాత మరల మామూలు స్థితికి వచ్చి సులువుగా కదలడం జరుగుతుంది. ఈ సమస్య నేడు యువతి, యువకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యవల్ల ఒక్కోసారి వెనె్నముక, తొడ ఎముకలపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి జాయింటుల్లో కదలికలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం వలన సమస్య తీవ్రత […]
October 17, 2012

నడుమునొప్పి.. నిర్లక్ష్యం పనికిరాదు!

నడుం నొప్పికి కీలకమైన వెన్నుముక నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (back pain) అంటారు. 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు […]
October 16, 2012

పులిపిర్లు ఇబ్బంది పెడుతుంటే…

పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలోనూ కనీసం 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరికాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా […]
August 9, 2012

నల్లేరు గొప్ప ఔషధం!

‘నల్లేరుమీద బండి’లా జీవితం సాగిపోతోంది అని, మెత్తగా సాపీగా జీవితం వుండటాన్ని ఉపమించే సామెత వాడుకలో వుంది. వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు. హిందీలో ‘హడ్ జోడ్’గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన ‘భవప్రకాశ’ గ్రంథంలో వివరించారు. ‘సిసస్ క్వాడ్రాంగులా’ లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌‘సి’, కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు. కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే ‘డ్యూరాబొలిన్’కంటె ఉత్తమ గుణం ఈ ‘నల్లేరు’లో వున్నాయని పరిశోధకులు ధృవీకరించారు. అస్థ్ధితువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే ‘మ్యూకోపాలిసాక్రైడ్స్’ దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి […]
August 9, 2012

తలనొప్పిని అశ్రద్ధ చేయొద్దు

తరచు వచ్చే తలనొప్పి శరీరానికి ‘పక్షవాతం’ లేదా ‘స్ట్రోకు’ వచ్చేలా చేయవచ్చు. అందుకే తలనొప్పిని అశ్రద్ధ చేయరాదు. అసలు తలనొప్పికి కారణం.. మెదడులో కణుతులు కావచ్చు. బి.పి మైగ్రేన్ కావచ్చు.. అరవై దాటాక తలనొప్పికి రక్తస్రావం, రక్తనాళాలు చిట్లడం ఇత్యాది కారణాలు వుంటాయి. చిన్నపిల్లల్లో మెదడులో ‘న్యూరోసిస్టీ సర్కోసిస్’ అనే పరాన్నజీవి కంతులు వుండటంవల్ల మెదడులోని ద్రవం పీడనం పెరిగి నరాలపై ఒత్తిడి తేవడం వల్ల కాలు, చేయి తాత్కాలికంగా […]
August 9, 2012

మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం

నిర్ణీత సమయంలో క్రమబద్ధంగాలేక, కష్టతరమైన మలవిసర్జనను మలబద్ధకం (Constipation) అంటారు. ఇది వ్యాధి కాదు లక్షణం మాత్రమే. చిన్నపిల్లలో, 60 సంవత్సరాలు పైబడిన వారిలో దీనిని ఎక్కువగా గమనించవచ్చు. వీరు తీసుకొనే ఆహారం తక్కువ పరిమాణంలో వుండటం మూలకారణం. వారంలో మూడుసార్లు మాత్రమే మలవిసర్జన జరగడం, మలవిసర్జన సమయంలో బాధ కలిగి వుండటం, సంపూర్తిగా మలవిసర్జన కలగకపోవడం మలబద్దకంగా పరిగణించాలి. గతంలో చిన్న పిల్లలకు సెలవు రోజుల్లో విరేచన కార్యక్రమం […]
September 27, 2011

పిసిఒడి ఉంటే..

ఇటీవల చాలామంది స్ర్తిలు అంటే సుమారుగా 100కి 75 నుండి 80 మంది మహిళలు, యుక్త వయస్కులు ఈ బాధపడుతున్నట్లు సర్వేల్లో తేలింది. వైద్య పరిభాషలో పిసిఒడి (పాలి సిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అనగా అండాశయంలో చిన్నచిన్న నీటి బుడుగులాంటి ‘సిస్ట్’లు ఏర్పడటం. ఇలాంటి ‘సిస్ట్’లు అండం విడుదలకు అడ్డంకిగా మారి సంతానలేమికి కారణమగుచున్నవి. ఒకవేళ కొందరు సిస్ట్ ఉండి గర్భం ధరించినా నిలువకుండా అబార్షన్ కావటం జరుగుతోంది. కారణాలు […]
September 27, 2011

మధుమేహం అత్యంత ప్రమాదకారి

మధుమేహం అత్యంత ప్రమాదకారి. దీనిని నియంత్రించుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 30 మిలియన్లకు మించి ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారంటే ఇది ఎంత మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, క్రమబద్ధమైన జీవనం పాటించకపోవడం, సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోకపోవడం వంటి కారణాలు ఈ వ్యాధికి మూలం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే ఎంతో ప్రమాదకరం. వయస్సుతో నిమిత్తం లేకుండా […]
August 28, 2011

ప్రొస్టేట్ కేన్సర్‌ను పసిగట్టేదెలా?

భారతదేశంలో మగవారిలో అత్యధికులలో ప్రోస్టేటు కేన్సరు కనిపిస్తున్నది అని డాక్టరు బి. త్యాగి బృందము (Asian Pac J Cancer Prev. 2010;11(2):397-401) 2010;11(2):397401) తెలియ జేసింది. ప్రోస్టేటు గ్రంధి మూత్రనాళాన్ని చుట్టి ఉంటుంది. వీర్యములో ఇరవై శాతము ప్రోస్టేటు గ్రంధి నుండి విడుదల అయిన ద్రవంతో పాటు మగ బీజాలు, సెమినల్ వేసైకల్సు నుండి వచ్చిన ద్రవం ఉంటాయి. ప్రోస్టేట్ కేన్సరు లక్షణాలు ఏమిటంటే ప్రయత్నించినా మూత్రం పోదు, […]
August 27, 2011

వెన్నెముక అరిగినపుడు…

నడుము భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడటంవల్ల నడుము నొప్పి వస్తుంది. దీనిని ఒక యంత్రంలోపల సంభవించే అరుగుదలతో పోల్చవచ్చు. డిస్కులు శిథిలమవటం మొదలై వర్టిబ్రే మధ్య ఉండాల్సిన జాగా తగ్గుతున్నప్పుడు ఫ్యాసెట్ జాయింట్లు అరిగిపోయి ఈ తరహా నొప్పి మొదలవుతుంది. సాధారణంగా వెన్నును తిప్పుతూ లేదా వంచుతూ ఏదైనా పని చేసినప్పుడు ఈ రకం నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా నడుములో కేంద్రీకృతమైనప్పటికీ పిరుదులు, తొడలు, తుంటి భాగాల్లో కూడా నొప్పిగా […]
August 23, 2011

రోగాసుర మర్దనం

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన చేయడం ఆయుర్వేద విధానంలో ఒక మార్గం. అయితే ఇది కేవలం ఒక ఆయుర్వేదానికే పరిమితం కాదు. ఆధునిక వైద్య చికిత్సతో పాటు మరెన్నో చికిత్సా ప్రక్రియల్లోనూ అవసరాన్ని బట్టి మర్దనను ఉపయోగించడం పరిపాటి. […]
August 2, 2011

పోత పాలు వద్దు.. తల్లి పాలే మేలు

తల్లిపాలు ప్రకృతి ప్రసాదించినవరం. మహిళల జీవితంలో ‘గర్భధారణ – కాన్పు – బిడ్డలకు పాలు పట్టుట’. ఆమె నిర్వహించే ప్రాకృతిక ధర్మాలలో కొన్ని దశలు. గర్భధారణ – కాన్పు నుండి పాలు పట్టుటను వేరు చేయలేము! చిన్నారి పుట్టినప్పటి నుండి తనతో మాట్లాడాలని తనను తాకాలని, తనను ఆడించాలని తల్లి నుండి ఇతరుల నుండి కోరుకుంటుంది. ఈ చర్యలన్నీ శిశు ఆరోగ్యానికి, శారీరక మానసికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఈ […]