August 9, 2012

నల్లేరు గొప్ప ఔషధం!

‘నల్లేరుమీద బండి’లా జీవితం సాగిపోతోంది అని, మెత్తగా సాపీగా జీవితం వుండటాన్ని ఉపమించే సామెత వాడుకలో వుంది. వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు. హిందీలో ‘హడ్ జోడ్’గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన ‘భవప్రకాశ’ గ్రంథంలో వివరించారు. ‘సిసస్ క్వాడ్రాంగులా’ లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‌‘సి’, కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు. కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే ‘డ్యూరాబొలిన్’కంటె ఉత్తమ గుణం ఈ ‘నల్లేరు’లో వున్నాయని పరిశోధకులు ధృవీకరించారు. అస్థ్ధితువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే ‘మ్యూకోపాలిసాక్రైడ్స్’ దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి […]
August 27, 2011

వెన్నెముక అరిగినపుడు…

నడుము భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడటంవల్ల నడుము నొప్పి వస్తుంది. దీనిని ఒక యంత్రంలోపల సంభవించే అరుగుదలతో పోల్చవచ్చు. డిస్కులు శిథిలమవటం మొదలై వర్టిబ్రే మధ్య ఉండాల్సిన జాగా తగ్గుతున్నప్పుడు ఫ్యాసెట్ జాయింట్లు అరిగిపోయి ఈ తరహా నొప్పి మొదలవుతుంది. సాధారణంగా వెన్నును తిప్పుతూ లేదా వంచుతూ ఏదైనా పని చేసినప్పుడు ఈ రకం నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా నడుములో కేంద్రీకృతమైనప్పటికీ పిరుదులు, తొడలు, తుంటి భాగాల్లో కూడా నొప్పిగా […]
October 17, 2012

నడుమునొప్పి.. నిర్లక్ష్యం పనికిరాదు!

నడుం నొప్పికి కీలకమైన వెన్నుముక నడుములో కలిగిన నొప్పిని నడుము నొప్పి (back pain) అంటారు. 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడతారని అంచనా. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు […]
January 3, 2011

వెన్నెముక సమస్యలు.. చికిత్స

సాధారణంగా ఉండే వెన్నెముక వెన్నుపాము 33 వెన్నుపూసలు, ఎముకగూడ ఖండరాలతో నిర్మించబడి ఉంటుంది.ఇవి ఒక దాని మరొకటి నిలువుగా పేర్చబడినట్లుంటాయి. వాటికి ఆధారంగా కండరాలు, అస్థిపంజరాలు ఉంటాయి. ప్రతి వెన్నుపూస మధ్య బిళ్లలు మెత్తగా ఉంటూ పనిచేస్తాయి. వెన్నుపూస పనేమిటంటే మొండెంకు స్థిరత్వాన్ని కదిలే గుణాన్ని కల్గించడమేకాకుండా వెన్నుపాములో ఉండే సున్నితమైన నరాలను కాపాడడం.ఇటువంటి వెన్నెముకలో పలు సమస్యలు ఎదురవుతాయి. వెన్నుముక నాలుగు భాగాలుగా విభజించబడింది. మెడభాగం, ఛాతిభాగం, వీపులో […]
November 1, 2010

పరిమాణక్రమంలో వెన్ను నిర్మాణం

పరిణామక్రమంలో సకశేరుకాలైన వివిధ జంతువులు నాలుగు కాళ్లు కలిగి, వాటి వెన్నెముకలు, వెన్నుపూస భూమికి సమాంతరంగా ఉండేవి. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం మొదలుపెట్టాడు. మిగతా జంతువుల కన్నా తన చేతుల ద్వారా రాయడం, తద్వారా జ్ఞాన సముపార్జన పొంది ఎంతో అభివృద్ధి చెందాడు. క్రమంగా వెన్నెముకలు, వెన్నుపూస భూమికి లంబకోణ ముఖంలో మార్పు చెందింది. తన దైనందిన కార్యక్రమంలో అన్ని పనులు ముందుకు వంగి చేసుకోవడానికి […]