క్షయవ్యాధిని వేగంగా, తేలికగా గుర్తించటానికి ఇప్పుడొక కొత్త పరీక్ష అందుబాటులోకి వచ్చింది. ఎక్స్పర్ట్ ఎంటీబీ/ఆర్ఐఎఫ్ అనే ఇది మందులకు లొంగని క్షయ రకాన్ని కూడా పసిగడుతుండటం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా క్షయను.. ముఖ్యంగా మందులకు లొంగని, హెచ్ఐవీ బాధితుల్లో వచ్చే రకాలను అరికట్టటంలో సఫలం కాలేకపోవటానికి నెమ్మదిగా, బండ పద్ధతుల్లో సాగుతున్న పరీక్షలూ దోహదం చేస్తున్నాయి. ప్రస్తుతం శిక్షణ పొందిన నిపుణులు సూక్ష్మదర్శిని ద్వారా చేసే ఈ పరీక్షలకు ఎంతో సమయం […]