కండరాలతో నిర్మితమయిన గర్భాశయం (యుటెరస్) 3-5 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళాల మందం ఉంటుంది. ఇది కొన్ని ప్రత్యేకమైన లిగమెంట్లు, కనెక్టివ్ టిష్యూతో… వెన్నుపూసకు, పెల్విక్ ఎముకలకు అతుక్కుని పొత్తి కడుపులో ఉంటుంది. గర్భాశయ గోడలో బయటినుండి లోపలికి సీరస్ పొర, మయొమెట్రియమ్ అనే కండరాల పొర, ఎండోమెట్రియమ్ అనే లోపలి పొర ఉంటాయి. కండరాల పొరలో సాగే గుణాన్నిచ్చే ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. […]