గత రెండున్నర నెలలుగా రాష్ట్రం ‘జ్వరాంధ్రప్రదేశ్’గా వేడెక్కిపోయిందనడంలో సందేహం లేదు. అయితే జ్వరాలు తగ్గించే పేరుతో ఆసుపత్రుల్లో తయారవుతున్న బిల్లులు కూడా వేలల్లో, లక్షల్లో పలకడం వినడానికి అతిశయోక్తిగా ఉన్నా నమ్మక తప్పదు. నేను 30 సంవత్సరాలు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ స్థాయిల్లో డాక్టరు ఉద్యోగం చేశాను. ఇందులో 20 ఏళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, చిన్న చిన్న తాలుకా ఆసుపత్రుల్లో, జిల్లా స్థాయి ఆసుపత్రిలో పనిచేశాను. […]