June 17, 2011

మోకాలినొప్పి – కారణాలు,నివారణ

మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి […]
August 9, 2012

తలనొప్పిని అశ్రద్ధ చేయొద్దు

తరచు వచ్చే తలనొప్పి శరీరానికి ‘పక్షవాతం’ లేదా ‘స్ట్రోకు’ వచ్చేలా చేయవచ్చు. అందుకే తలనొప్పిని అశ్రద్ధ చేయరాదు. అసలు తలనొప్పికి కారణం.. మెదడులో కణుతులు కావచ్చు. బి.పి మైగ్రేన్ కావచ్చు.. అరవై దాటాక తలనొప్పికి రక్తస్రావం, రక్తనాళాలు చిట్లడం ఇత్యాది కారణాలు వుంటాయి. చిన్నపిల్లల్లో మెదడులో ‘న్యూరోసిస్టీ సర్కోసిస్’ అనే పరాన్నజీవి కంతులు వుండటంవల్ల మెదడులోని ద్రవం పీడనం పెరిగి నరాలపై ఒత్తిడి తేవడం వల్ల కాలు, చేయి తాత్కాలికంగా […]
May 17, 2011

నడుమునొప్పి నిర్లక్ష్యం చేయొద్దు

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య నడుమునొప్పి. ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కన్పించే నడుమునొప్పి (‘లంబార్ స్పాడండైలోసిస్’) ఇప్పుడు వయసుతో నిమిత్తము లేకుండా ఇటీవల యుక్తవయసులో ఉన్నవారు సైతం ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం మారుతున్న జీవనశైలి విధానమే. నడుమునొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా సమస్య తొలి దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నయమవుతుంది. శరీరానికి ఊతమిచ్చే […]
August 27, 2011

వెన్నెముక అరిగినపుడు…

నడుము భాగంలోని వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడటంవల్ల నడుము నొప్పి వస్తుంది. దీనిని ఒక యంత్రంలోపల సంభవించే అరుగుదలతో పోల్చవచ్చు. డిస్కులు శిథిలమవటం మొదలై వర్టిబ్రే మధ్య ఉండాల్సిన జాగా తగ్గుతున్నప్పుడు ఫ్యాసెట్ జాయింట్లు అరిగిపోయి ఈ తరహా నొప్పి మొదలవుతుంది. సాధారణంగా వెన్నును తిప్పుతూ లేదా వంచుతూ ఏదైనా పని చేసినప్పుడు ఈ రకం నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా నడుములో కేంద్రీకృతమైనప్పటికీ పిరుదులు, తొడలు, తుంటి భాగాల్లో కూడా నొప్పిగా […]
October 25, 2010

కారణం తెలియని కడుపునొప్పి

ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌. దీనినే ఐబిఎస్‌ అని కూడా అంటారు. ఇది జీర్ణాశయంలో జీర్ణకోశం, పేగులకు సంబంధించిన వ్యాధి. జీర్ణకోశం, పేగుల పనితీరులో మార్పులుంటాయి. మలవిసర్జనలో మార్పులు, కడుపులో ఓ విధమైన నొప్పిగా ఉంటుంది. పేగులు అతిగా స్పందించడం వల్ల ఇది కలుగుతుంది. స్త్రీలలో ఎక్కువ. సాధారణంగా 30 ఏళ్లలోపు వయస్సులో అధికం. కారణాలు   దీనికి స్పష్టమైన కారణం అంటూ తెలియదు. కొందరిలో ఆహారం సరిపడక అలర్జీగా తయారై, వ్యాధిగా […]
November 4, 2013

కీళ్లనొప్పులు – ఆయుర్వేద పరిష్కారాలు

ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్‌ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన […]
May 30, 2011

మైగ్రెయిన్ తలనొప్పికి ఆయుర్వేద పరిష్కారాలు

మైగ్రెయిన్ అనేది తరచూ వచ్చే తలనొప్పి. రక్తనాళాలు, నరాలు మెదడుకు చెందిన సెరటోటిన్, నార్ ఎడ్రినలిన్ వంటి జీవరసాయన పదార్థాల్లో చోటుచేసుకునే మార్పువల్ల వస్తుంది. ఇందులో క్లాసిక్ మైగ్రెయిన్, కామన్ మైగ్రెయిన్ అని రెండు రకాలున్నాయి. ఏడాదికి రెండు మూడు సార్లే వస్తుంది. సాధారణంగా దీనితో ప్రాణహానీ ఉండదు. అయితే తలనొప్పి తీవ్రత హెచ్చుస్థాయిలో ఉండటంతో బాధితుల రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది. దీనితో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఆయుర్వేదంలో […]
May 31, 2015
instant noodles

మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి!

అమ్మా ఆకలి…అంటూ పిల్లవాడు పరిగెత్తుకురాగానే, టూ మినిట్స్‌ అమ్మా! అంటూ మ్యాగీ ప్యాకెట్‌ చించి నీళ్లలో వేసి ప్లేట్‌లో వేడి వేడి నూడుల్స్‌ వడ్డించేస్తుంది. టు మినిట్స్‌ ఫుడ్‌ అంటేనే మ్యాగీ అని అర్థమయ్యేంతగా దాన్ని ప్రచారం చేశారు. ముఖ్యంగా పిల్లలు, యువతను ఈ ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ బాగా ఆకట్టుకుంది. అయితే రెండు నిముషాల్లో వండి పెట్టడం బాగానే ఉంది కానీ, దాన్ని పూర్తిగా అరిగించుకోవాలంటే మీ జీవితం చాలదు […]
April 26, 2014

నిమ్మరసంతో నిండైన ఆరోగ్యం

వంటింటి చిట్కాలని తేలిగ్గా కొట్టి పరేస్తుంటాం. కానీ, అవే మన శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ఎంతో ఉపకరిస్తాయి. నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో వినియోగిస్తే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం జరుగుతుంటుంది. నిమ్మకాయ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మరసంలో 5 శాతం సిట్రిక్‌ యాసిడ్‌ […]
December 14, 2010

వేధించే మెడనొప్పి

 మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం జీవనశైలి విధానమే. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నమయవుతుంది. మెడ వెనుక భాగంలో తల […]