November 16, 2010

అమ్మ కడుపులోనే ఆపరేషన్‌

ఈ ప్రకృతిలో.. పువ్వు సున్నితం! మొగ్గ మరింత సున్నితం!! బిడ్డ సున్నితం! పిండం మరింత సున్నితం!! పొత్తిళ్లలోని పురిటి గుడ్డుకు, ముట్టుకుంటే కందిపోయే లేలేత పసికందుకు ఆపరేషన్‌ చెయ్యటమే కష్టమనుకుంటే.. ఇప్పుడు ఏకంగా తల్లి కడుపులోని నలుసుకే సంక్లిష్టమైన చికిత్సలు చేసే స్థాయికి చేరుకుంది మన వైద్యరంగ0 పిండం.. ఈ ప్రకృతిలో అపురూపానికే అపురూపం. అందుకే దానికి అంతటి సుకుమారమైన రక్షణ! అమ్మ కడుపులో.. దళసరి గర్భసంచిలో.. మృదువైన మాయ […]
June 2, 2011

కండరాలకు బలాన్నిచ్చే వ్యాయామం

మన శరీర ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం వల్ల కండరాలకు బలం వస్తుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే ప్రతిరోజూ కొద్దిసేపు వ్యాయామం చేయటం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం కొంత సేపు వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ పొద్దున్నే లేవగానే మలవిసర్జన తర్వాత కొంత సమయం పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల కండరాలకి బలం వస్తుంది. రక్త ప్రసారం బాగా జరిగి శరీర బాగాలకు కావల్సిన ఆమ్లజని లభిస్తుంది. […]
February 15, 2014

పిల్లలకు పాలివ్వకపోవడం వల్ల క్యాన్సర్‌ రావచ్చు

క్యాన్సర్‌… మన దేశంలో ప్రతి ఎనిమిదిమందిలో ఒకరు, యాభై ఐదేళ్ల వయస్సు దాటిన వారు క్యాన్సర్‌తో బాధపడు తున్నారు. ప్రస్తుతం సంభవిస్తున్న మరణాల్లో ఎక్కువగా గుండె జబ్బు తర్వాత రెండో స్థానంలో ఉన్నది క్యాన్సరే. ఇది శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. కానీ సాధారణంగా మగవాళ్లల్లో ఓరల్‌ (నోటికి) సంబంధించిన క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆడవాళ్లల్లో రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌ ఎక్కువ. అభివృద్ధి […]
November 1, 2010

పరిమాణక్రమంలో వెన్ను నిర్మాణం

పరిణామక్రమంలో సకశేరుకాలైన వివిధ జంతువులు నాలుగు కాళ్లు కలిగి, వాటి వెన్నెముకలు, వెన్నుపూస భూమికి సమాంతరంగా ఉండేవి. మానవ పరిణామక్రమంలో మనిషి రెండు కాళ్లతో నడవడం మొదలుపెట్టాడు. మిగతా జంతువుల కన్నా తన చేతుల ద్వారా రాయడం, తద్వారా జ్ఞాన సముపార్జన పొంది ఎంతో అభివృద్ధి చెందాడు. క్రమంగా వెన్నెముకలు, వెన్నుపూస భూమికి లంబకోణ ముఖంలో మార్పు చెందింది. తన దైనందిన కార్యక్రమంలో అన్ని పనులు ముందుకు వంగి చేసుకోవడానికి […]
November 16, 2010

అలర్జీ వ్యాధులకు చెక్‌ ఇలా…

నేడు చాలామంది రకరకాల అలర్జీ వ్యాధుల బారిన పడు తున్నారు. కొందరికి ఆహార పదార్థాలు సరిపడక పోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, మరి కొందరికి దుమ్ము, ధూళి, చల్లని పదార్థాలు మొదలైన వాటి వల్ల అలర్జీ కలుగుతుంది. ఏ మనిషిలోనైన అలర్జీ కలిగించే పదార్థాలను అలర్జెన్స్‌ అంటారు. ఒక వ్యక్తి తనకు సరిపడని పదార్థాలు (అలర్జెన్స్‌) తీసుకున్నప్పుడు అతడి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ తేలికగా, అతి ఎక్కువగా స్పందించి […]
April 24, 2014
పొత్తి కడుపు నొప్పి

పొత్తి కడుపు నొప్పి – నివారణోపాయాలు

వివిధ వృత్తుల్లో పనిచేసే మహిళలు, గృహిణులు, వివిధ యంత్ర పరికరాలపై పనిచేసే స్ర్తిలు, రసాయనాల ఫ్యాక్టరీలలో పనిచేసేవారు, ఆహార పదార్థాలలో అధికంగా కారం మసాలాలు సేవించేవారు, ఎండలో పనిచేసే వివిధ వృత్తులవారు, మూత్ర విసర్జనకి వీలుకాని సందర్భం తోడైనపుడు, ఇతరేతర కారణాలవల్ల ఇన్‌ఫెక్షన్ సోకినపుడు మూత్రంలో మంట, మూత్ర విసర్జనాంతరం పొత్తి  కడుపు నొప్పి, మూత్రదోహం, జ్వరం, మూత్ర విసర్జనపుడు దుర్వాసన, నడుము నొప్పి, వాంతులు మొదలగు లక్షణాలు ఏర్పడతాయి. కిడ్నీలు […]
June 23, 2011

కంప్యూటర్‌ తరచుగా ఉపయోగిస్తున్నారా ?

ఏకధాటిగా గంటలకొద్ది కంప్యూటర్‌ ఎదురుగా ఉన్నప్పుడు ఐ స్ట్రెయిన్‌తో పాటు తలపోటు, మెడనొప్పి రావడం సహజం. కొంతమందిలో రాను రాను చూపు కూడా మందగించవచ్చు. కాబట్టి ప్రతి పది నిమిషాలకు ఒకసారి కనీసం దూరంలో ఉన్న వస్తువుల మీద దృష్టి కాసేపు మరల్చినట్లయితే ఇటువంటి దుష్ర్పభావాలకు దూరంగా ఉండవచ్చు. ఎడతెరపి లేకుండా గంటల కొద్దీ కంప్యూటర్‌ ముందు కూర్చుండే వారిలో రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది ముఖ్యంగా కాళ్లలో ఉండే […]
October 4, 2010

మొలలు – చికిత్స, నివారణ

కొందరు పైల్స్ వంటి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. మల విసర్జన ద్వారం వద్ద వచ్చే ఇటువంటి వ్యాధులు వారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పైల్స్‌తో పాటు ఫిషర్‌, ిఫిస్టులా వంటి వ్యాధులు నేడు సాధారణంగా అందరికీ వస్తున్నాయి. అవసరమైన వైద్యం చేయించుకొని ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలతో ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పైల్స్: సాధారణంగా వస్తున్న వ్యాధుల్లో పైల్స్ ఒకటి. […]
August 3, 2010

హిస్టీరియా

హిస్టీరియా : ప్రాథమిక అవగాహనహిస్టీరియా మెదడు, నాడీ మండలాలకు సంబం ధించిన వ్యాధి. పురుషులలో కంటే స్త్రీలలో ఈ రుగ్మత ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ జననేంద్రియ సముదాయం అంటే గర్భా శయంనుంచి అన్ని జననేంద్రియ భాగాలలో అంతర్గతంగా ఉండే నాడీ సంబంధ వ్యాధికారక లక్షణాలతో చాలా వరకూ ముడిపడి ఉండే విప రీత మానసిక లక్షణమిది. హిస్టీరియా పదం గ్రీకు భాషలోని హిస్టేరా అనే పదంనుంచి పుట్టింది. హిస్టేరా అంటే […]
December 14, 2010

చిన్నపిల్లలకు అదనపు ఆహారం

చిన్న పిల్లలకు మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు అన్ని ఆహార అవసరాలు తీరుస్తుంది.చిన్నారులు బాగా పెరుగుతూ,రోజుకు ఐదారుసార్లు మూత్రవిసర్జన చేస్తుంటే వారికి తల్లిపాలు సరిపోతున్నట్లు. అన్ని ఆహార అవసరాలు తీరుస్తున్నట్లు. చిన్న పిల్లలకు అదనపు ఆహారం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఏ ఆహారంతో మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి అనే అంశాల గురించి చాలామంది తల్లులకు సరైన అవగాహన లేదు. నాలుగు నెలలు పూర్తి కాకముందు అదనపు […]
December 13, 2010

గాయాలైనప్పుడు

మనలో అందరికీ ఎప్పుడో ఒకప్పుడు గాయాలవుతుంటాయి. గాయాలైనప్పుడు కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. అవి…. * గాయమేదైనప్పటికీ, వెంటనే శుభ్రమైన నీటితోకానీ, గోరు వెచ్చని నీటితో గానీ గాయాన్ని కడగాలి. ఎలాంటి ఆయింట్‌మెంట్‌ పూయకండి. చిన్న చిన్నగాయాలకు కట్టుకూడా అక్కరలేదు. * గాయం నుండి రక్తం కారుతూ ఉంటే, పరిశుభ్రమైన గుడ్డతో కొద్దిసేపు ఒత్తి పట్టుకోండి. సాధారణంగా రక్తం కారడం ఆగిపోతుంది. * గాయాలకు బొగ్గు, కాఫీపొడి, పసుపు, సున్నం, […]
November 1, 2010

గట్టిపడ్డ కాలేయానికి చికిత్స

కాలేయంలోని కణాలు నశించి, దానిలో ఫైబ్రోసిస్‌ అనగా కాలేయం గట్టిపడటం, క్షీణించడం, ఉండలుగా (నాడ్యూల్స్‌) తయారవడం, దాని ఆకృతి మారిపోతుంది. దీన్నే సిరోసిస్‌ ఆఫ్‌ లివర్‌ అంటారు. కారణాలు మద్యం సేవించడం. వైరల్‌ హెపటైటిస్‌. కొన్ని లివర్‌ మీద ప్రభావం చూపే మందులు వాడటం. పిత్తకోశం కుంచించుకుపోవడం. చాలా రోజులుగా పిత్తాశయంలో రాళ్ళు వుండడం. కంజెస్టివ్‌ హార్టు ఫెయిల్యూర్‌ (గుండె జబ్బులు), చిన్న వయస్సులో లివర్‌ జబ్బులు రావడం మొదలైనవి […]