December 14, 2010

మోకాలు నొప్పి.. ఎందుకు వస్తుందంటారు?!

మోకాళ్ళ నొప్పి చాలా సాధారణమైన సమస్య.45ఏళ్లు దాటిన వారిలో ప్రతి ముగ్గురిలోనూ ఒకరు ఎంతో కొంత స్థాయిలో మోకాళ్ళనొప్పితో బాధపడుతున్నారని అధ్యయనాలు చెపుతున్నాయి. మోకాళ్ళనొప్పికి కారణాలు అనేకం. ఎములను కలపే స్నాయువు (లిగమెంట్) చీరుకుపోవం, మృదులాస్థి దెబ్బతినటం వంటి అభిఘాతజన్య కారణాలే కాకుండా ఆర్తరైటిస్, గౌట్, ఇనె్ఫక్షన్ వంటి వ్యాధి స్థితులు కూడా మోకాలు నొప్పిని కలిగించే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ తగిన సూచనలు పాటిస్తూ, […]
April 26, 2014

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్

సర్వైకల్ కేన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారతదేశంలో మహిళలను హతమారుస్తోంది. గణనీయంగా ముందుగానే నిరోధించగల వ్యాధి ఇది అని నిపుణులు చెబుతున్నారు. నిరోధక టీకాలు కేన్సర్ రాకుండా వాక్సిన్ ద్వారా ముందుగానే నిరోధించే అవకాశం రూపొందిన తొలి కేన్సర్ రకం ఇదే. ఇందుకుగాను ఒకటి కాదు రెండు వ్యాక్సీన్లు ఉన్నాయి. అయినా కూడా భారతదేశంలో ఇది ఏటా 1,32,000 మంది మహిళలకు సోకుతోందని, ఇందులో 72వేల […]
January 3, 2011

నిద్రలేమి

నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి. దీన్నే ఇన్‌సోమ్నియా అంటారు. దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. ‘వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్య మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం’ జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం […]
August 23, 2011

రోగాసుర మర్దనం

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు మర్దన ఒకటే సమర్థమైన చికిత్స. పుట్టిన బిడ్డ ఎముకలు గట్టిపడటానికి మొదలుకొని ఎన్నో కీలక సమస్యలలో మర్దనను ఒక చికిత్సా ప్రక్రియలా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలలో అనేక తైలాలతో మర్దన చేయడం ఆయుర్వేద విధానంలో ఒక మార్గం. అయితే ఇది కేవలం ఒక ఆయుర్వేదానికే పరిమితం కాదు. ఆధునిక వైద్య చికిత్సతో పాటు మరెన్నో చికిత్సా ప్రక్రియల్లోనూ అవసరాన్ని బట్టి మర్దనను ఉపయోగించడం పరిపాటి. […]
May 31, 2011

మహిళల్లో సంతాన లేమి.. కారణాలు

సంతానలేమితో బాధపడే 45శాతం జంటల్లో లోపం ప్రధానంగా మహిళ ల్లో కానవస్తుంది.వారిలో సంతానలేమికి గల కారణాల్లో ప్రధ నమైనవి:ఖీ బీజవాహికలు దెబ్బతినడం ఖీ రుతుచక్ర సమస్యలు.ఎండోమెట్రియాసిస్‌: గర్భాశయ కణాల్లాంటివి గర్భాశయంలో గాకుండా దాని వెలుపల అసాధారణ రీతిలో వృద్ధి చెందే పరిస్థితిని ఎండోమెట్రియాసిస్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా గర్భాశయం లోపలి కణాలు ప్రతీనెల రుతుస్రావంలో బయటపడుతాయి.వెలుపల ఉండే కణాలు మాత్రం కణజాలా నికి అతుక్కొని ఉంటాయి. అండాశయం పైన, బీజవాహికల వద్ద, […]
March 29, 2014

కూల్‌డ్రింక్స్‌తో పళ్ళకు హాని

మన శరీరం పూర్తిగా జీవ కణజాలంతో నిర్మితమైంది. ప్రతి ఒక్క జీవకణానికి ప్రాణం ఉంటుంది. ఈ జీవకణాలకు ఎప్పుడు ఫ్లూయిడ్స్ (జీవజలం) సాంద్రత శాతం నిర్దిష్టంగా ఉండాలి. వేసవిలో ఎండ వేడిమికి శరీరంలో జీవజలం శాతం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో శరీరంలోని జీవకణాలు దెబ్బతిని ఆయా అవయవాలు విధి నిర్వహణ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వర్తించలేక శరీరంలో శక్తి తక్కువైపోయి శరీరం కదలలేని పరిస్థితి ఏర్పడి కూలబడిపోతుంది. ఈ పరిస్థితినే ‘డిహైడ్రేషన్’ […]
November 1, 2010

గట్టిపడ్డ కాలేయానికి చికిత్స

కాలేయంలోని కణాలు నశించి, దానిలో ఫైబ్రోసిస్‌ అనగా కాలేయం గట్టిపడటం, క్షీణించడం, ఉండలుగా (నాడ్యూల్స్‌) తయారవడం, దాని ఆకృతి మారిపోతుంది. దీన్నే సిరోసిస్‌ ఆఫ్‌ లివర్‌ అంటారు. కారణాలు మద్యం సేవించడం. వైరల్‌ హెపటైటిస్‌. కొన్ని లివర్‌ మీద ప్రభావం చూపే మందులు వాడటం. పిత్తకోశం కుంచించుకుపోవడం. చాలా రోజులుగా పిత్తాశయంలో రాళ్ళు వుండడం. కంజెస్టివ్‌ హార్టు ఫెయిల్యూర్‌ (గుండె జబ్బులు), చిన్న వయస్సులో లివర్‌ జబ్బులు రావడం మొదలైనవి […]
June 10, 2014
మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి?

మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, మూత్ర విసర్జనలో అవరోధం, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వంటి సమస్య మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీయవచ్చు. నీళ్లు తక్కువగా తాగేవారిలో, చెమటలు అధికంగా పోసేవారిలో రక్తంలో లవణాల సాంద్రత పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. శారీక శ్రమ, వ్యాయామం లేకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య సాధారణంగా 30 ఏళ్లపైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది స్త్రీలలోకంటే పురుషుల్లో మూడు […]
June 2, 2011

కండరాలకు బలాన్నిచ్చే వ్యాయామం

మన శరీర ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం వల్ల కండరాలకు బలం వస్తుంది. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలంటే ప్రతిరోజూ కొద్దిసేపు వ్యాయామం చేయటం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం కొంత సేపు వ్యాయామం చేయాలి. ప్రతిరోజూ పొద్దున్నే లేవగానే మలవిసర్జన తర్వాత కొంత సమయం పాటు వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల కండరాలకి బలం వస్తుంది. రక్త ప్రసారం బాగా జరిగి శరీర బాగాలకు కావల్సిన ఆమ్లజని లభిస్తుంది. […]
May 30, 2011

మైగ్రెయిన్ తలనొప్పికి ఆయుర్వేద పరిష్కారాలు

మైగ్రెయిన్ అనేది తరచూ వచ్చే తలనొప్పి. రక్తనాళాలు, నరాలు మెదడుకు చెందిన సెరటోటిన్, నార్ ఎడ్రినలిన్ వంటి జీవరసాయన పదార్థాల్లో చోటుచేసుకునే మార్పువల్ల వస్తుంది. ఇందులో క్లాసిక్ మైగ్రెయిన్, కామన్ మైగ్రెయిన్ అని రెండు రకాలున్నాయి. ఏడాదికి రెండు మూడు సార్లే వస్తుంది. సాధారణంగా దీనితో ప్రాణహానీ ఉండదు. అయితే తలనొప్పి తీవ్రత హెచ్చుస్థాయిలో ఉండటంతో బాధితుల రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది. దీనితో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఆయుర్వేదంలో […]
July 3, 2011

చర్మసౌందర్యానికి గోరింటాకు

గోరింటాకు కేశ సౌందర్యానికే కాకుండా చర్మానికి కూడా చేసే మేలు అంతా ఇంతా కాదు. లేత గోరింటాకు ప్యాక్‌ చేసుకుంటే బ్యూటీ పార్లర్‌కి వెళ్లకుండానే మీ ముఖం తాజాదనంతో మెరిసి పోతుంది. ఈ ప్యాక్‌ ఎలా చేసుకోవాలంటే… ఐదారు టీస్పూన్ల తేనె, లేత గోరింటాకు ముద్ద, తగినన్ని పాలు కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా ముఖానికి వేసుకుని 5,10 నిమిషాల పాటు మర్ధన చేసి ఆపై కడిగేసుకుంటే ముఖంలో తాజా దనానికి […]
December 21, 2010

పండ్లు, కూరగాయలతో.. దీర్ఘాయుష్షు

దీర్ఘాయుష్షు సొంతం చేసుకోవాలనుకుంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినటం మొదలెట్టండి. వీటిల్లోని బీటా, అల్ఫా కెరటిన్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి క్యాన్సర్‌, గుండెజబ్బుల వంటి పలు ప్రాణాంతక జబ్బుల మూలంగా సంభవించే మరణాల ముప్పునూ తగ్గిస్తాయని వెల్లడైంది. కెరొటెనాయిడ్లుగా పిలుచుకునే ఇవి పండ్లు, కూరగాయలకు ఎరుపు, పసుపు, నారింజ రంగులను తెచ్చిపెడతాయి. లోనికి వెళ్లాక శరీరం ఈ బీటా కెరటిన్లను విటమిన్‌ ఎ గా మార్చుకుంటుంది. క్యారట్లు, […]