October 25, 2010

అధిక బరువు… నష్టాలు

స్థూలకాయులు అధిక బరువుతో కలిగే సమస్యల నుంచే కాకుండా మూత్రపిండాల వంటి శరీరాంతర్గత అవయవాల సంబంధిత వ్యాధులతో కూడా బాధపడే అవకాశాలున్నాయి.స్థూలకాయులకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది మూత్రపిండాల్లో రాళ్లు    ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనుపిస్తుంటుంది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య 50 శాతం తక్కువే అయినప్పటికీ స్థూలకాయం గల మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా […]
August 9, 2012

మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం

నిర్ణీత సమయంలో క్రమబద్ధంగాలేక, కష్టతరమైన మలవిసర్జనను మలబద్ధకం (Constipation) అంటారు. ఇది వ్యాధి కాదు లక్షణం మాత్రమే. చిన్నపిల్లలో, 60 సంవత్సరాలు పైబడిన వారిలో దీనిని ఎక్కువగా గమనించవచ్చు. వీరు తీసుకొనే ఆహారం తక్కువ పరిమాణంలో వుండటం మూలకారణం. వారంలో మూడుసార్లు మాత్రమే మలవిసర్జన జరగడం, మలవిసర్జన సమయంలో బాధ కలిగి వుండటం, సంపూర్తిగా మలవిసర్జన కలగకపోవడం మలబద్దకంగా పరిగణించాలి. గతంలో చిన్న పిల్లలకు సెలవు రోజుల్లో విరేచన కార్యక్రమం […]
November 29, 2010

గర్భనిరోధక మాత్రలు… ఉపయోగాలు

ఆరోగ్యవంతంగా తల్లి, శిశువు ఉండాలంటే ఫ్యామిలి ప్లానింగ్‌ తప్పనిసరి. కాన్పు,కాన్పుకు కనీసం రెండు సంవత్సరాల గ్యాప్‌ ఉంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా క్షేమంగా ఉంటారు. ఈ నేపథ్యంలో గర్భని రోధానికి నేడు వివిధ మాత్రలు లభిస్తున్నాయి. వీటిని డాక్టర్‌ సలహా మేరకు వాడాలి. కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నా గర్భనిరోధానికి ఇవి ఎంతో ఉపయోగ కరం గా ఉంటాయి.గర్భనిరోధానికి రెండు రకాల పద్ధతులున్నాయి. ఇవి పర్మనెంట్‌, టెంపరరీ […]
December 20, 2010

క్లోమం వ్యాధి-వైద్యం

మనిషి కడుపులోని క్లోమం అనే శరీర భాగం ఎంతో ముఖ్యమైనది. ఇది కొవ్వు పదార్థాలను కరిగించడమే కాకుండా షుగర్‌ లెవెల్స్‌ను కూడా అదుపులోకి తెస్తుంది. శరీరానికి కావాల్సిన ఇన్సులిన్‌ ఈ క్లోమంతోనే తయారవుతుంది. ఈ నేపథ్యంలో క్లోమం ఇన్‌ఫెక్షన్‌కు గురై వచ్చే వ్యాధే ప్యాంక్రియాటైటిస్‌. దీని వల్ల మనిషిలో జీర్ణశక్తి తగ్గి పలు సమస్యలు ఎదురవుతాయి. ఎంతో ముఖ్యమైన క్లోమం ఇన్‌ఫెక్షన్‌కు పలు కారణాలున్నాయి. ఈ వ్యాధిగ్రస్థుల్లో దాదాపు 50 […]
June 17, 2011

మోకాలినొప్పి – కారణాలు,నివారణ

మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడటానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడటం, విచక్షణ రహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడుదిగుడు ప్రాంతాల్లో నడక వంటి […]
October 11, 2010

ఇదీ ‘అవాండియా’ కథ

టైప్‌-2 డయా బెటిస్‌లో ఇన్సులిన్‌ సెన్సిటై జర్‌గా విస్త్రతంగా చలామ ణీలోవున్న రోసిగ్లి టజోన్‌ (అవాండియా పేరుతో ప్రపంచ దేశాల్లో చలామణిలో ఉన్నది) వాడకం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ వుతున్నట్లు నిర్ధారణ కావడంతో తాజాగా సెప్టెంబర్‌, 2010లో ఐరోపా దేశాల్లో నిషేధించారు. అమెరికాలో దీనివాడకంపై మరిన్ని షరతులు విధించారు. మనదేశంలో ఇంకా ఏ నిర్ణయం వెలువడలేదు. 1999 నుండి చలామణీలో ఉన్న ఈ మందువల్ల ఈలోగా ప్రజలకు […]
March 30, 2014

జ్ఞాన దంతం తీస్తే జ్ఞానం పోతుందా?

సాధారణంగా మానవ జీవితాన్ని నాలుగు దశలుగా విభజింపవచ్చు. బాల్యం: ఈ దశలో ఉన్న పిల్లలకు అంటే పుట్టినప్పటినుండి 13 సంవత్సరాల లోపు పిల్లలను బాల్య దశగా పరిగణిస్తారు. ఈ దశలో పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి. ఈ దశను ‘అగ్లిడక్లంగ్’ దశ అని అంటారు. ఎందుకంటే పాలపళ్లు కొన్ని ఊడిపోతుంటే కొన్ని వస్తుంటాయి. ఇట్లా పళ్లన్ని కూడ అస్తవ్యస్తంగా వికారంగా చూడడానికి అందవికారంగా వుంటాయి. యుక్త వయసు: సాధారణంగా […]
July 5, 2011

క్యారెట్‌తో మేధో వికాసం!

పిల్లల మేధోవికాసానికి ఆకుకూరలు, పండ్లు ఎంతగానో దోహదపడతాయన్న విష యం మనకందరికీ తెలిసిందే! అధిక పోషక విలువలున్న ఏ ఆహారపదార్థమైనా పిల్లల ఎదు గుదలకు, మేధోవికాసానికి తోడ్పడతాయి. పిల్లల మేధో వికాసానికి క్యారెట్‌ ఎంతో మంచిదంటున్నారు డాక్టర్లు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టప డరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా […]
September 27, 2011

మధుమేహం అత్యంత ప్రమాదకారి

మధుమేహం అత్యంత ప్రమాదకారి. దీనిని నియంత్రించుకోవడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 30 మిలియన్లకు మించి ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారంటే ఇది ఎంత మేరకు విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, క్రమబద్ధమైన జీవనం పాటించకపోవడం, సరైన ఆహార అలవాట్లను అలవర్చుకోకపోవడం వంటి కారణాలు ఈ వ్యాధికి మూలం. ఈ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే ఎంతో ప్రమాదకరం. వయస్సుతో నిమిత్తం లేకుండా […]
November 9, 2010

దగ్గు… ప్రేరకాలు

కఫo నాసిక వెనుక నుంచి గొంతు అడుగు భాగం లోపలకు స్రవించటం (పోస్ట్‌నేసల్ డ్రిప్) మన నాసిక లోపల, గొంతు లోపల ఉండే గ్రంథులు రోజు దాదాపు లీటర్ – లీటరున్నర వరకూ కఫo తయారు చేస్తుంటాయి. ఈ పదార్థం నాసికలను, గొంతును తడిగా ఉంచడమే కాకుండా ఎప్పటికప్పుడు అంతర్గత ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంటుంది. మామూలు పరిమాణంలో ఉన్నంత వరకూ ఈ పదార్థాన్ని మనకు తెలియకుండానే మింగేస్తుంటాం. అయితే ఎలర్జీలు, జలుబు, […]
March 29, 2014

కూల్‌డ్రింక్స్‌తో పళ్ళకు హాని

మన శరీరం పూర్తిగా జీవ కణజాలంతో నిర్మితమైంది. ప్రతి ఒక్క జీవకణానికి ప్రాణం ఉంటుంది. ఈ జీవకణాలకు ఎప్పుడు ఫ్లూయిడ్స్ (జీవజలం) సాంద్రత శాతం నిర్దిష్టంగా ఉండాలి. వేసవిలో ఎండ వేడిమికి శరీరంలో జీవజలం శాతం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో శరీరంలోని జీవకణాలు దెబ్బతిని ఆయా అవయవాలు విధి నిర్వహణ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వర్తించలేక శరీరంలో శక్తి తక్కువైపోయి శరీరం కదలలేని పరిస్థితి ఏర్పడి కూలబడిపోతుంది. ఈ పరిస్థితినే ‘డిహైడ్రేషన్’ […]
June 1, 2011

మూర్ఛ వ్యాధి – వైద్యం

మూర్ఛ వ్యాధి అనేది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే నరాలకుసంబంధించిన పరిస్థితి. మూర్ఛవ్యాధిని మూర్ఛల అనారోగ్యం అని కూడా అంటారు. కనీసం రెండు మూర్ఛలు ఒక వ్యక్తికి వచ్చిన తర్వాత సాధారణంగా రోగ నిర్ధారణ చేయబడుతుంది.మూర్ఛ వ్యాధి మెదడుకు ఏర్పడిన ఒక గాయంగా పరిగణించవచ్చు. కానీ చాలా సార్లు కారణం ఏమిటో తెలియదు. మూర్ఛ వ్యాధి ఏ తరహావి అన్నది లేదా అవి ఎంత తీవ్రమైనవి అని బయట ఎవరూతెలుసుకోలేరు. […]